మద్దిపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఘటనా స్థలంలోనే ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిపై మద్దిపాడు ఫ్లై ఓవర్ వద్ద చోటుచేసుకుంది. మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన కొణిజేటి శివప్రసాద్ (38) ఒంగోలులో కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు. శనివారం రాత్రి షాపు మూసివేసి తిరిగి వెల్లంపల్లికి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్నాడు. మద్దిపాడు ఫ్లై ఓవర్‌పై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


