పది పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 165 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 8 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌లు జరగకుండా ఉండేందుకు 9 ఫ్లయింగ్, 10 సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షల నిర్వహణకు 1718 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు 165 మంది, డిపార్ట్‌మెంట్ అధికారులు 165 మందిని నియమించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం సెట్–1, 11వ తేదీ సాయంత్రం సెట్–2 ప్రశ్నపత్రాలు జిల్లాకు వస్తాయని అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా 38 స్టోరేజ్ పాయింట్లలో రెండు సెట్ల ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు.


