జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అట్టహాసంగా మహిళా దినోత్సవం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి మేరుగు, బత్తుల, చుండూరి, తదితరులు
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో మహిళల సంక్షేమం అనేది కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అధ్యక్షత వహించగా, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళల సాధికారతకు సమిష్టి కృషి అవసరమన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా కుటుంబాలు, సమాజం మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళల హక్కులు, గౌరవం కాపాడటంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళలకు అవకాశాలతోనే సమాజం అభివృద్ధి : బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున మాట్లాడుతూ మహిళల సాధికారతకు రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న విశేషంగా కృషి చేశారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలు ప్రశ్నించాలన్నారు.
ముందు పార్టీ కార్యాలయంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చుండూరి రవిబాబు గజమాలతో ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీబీ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.వి.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు సీఎం వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి, అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు కనపర్తి గోవిందమ్మ, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణకుమారి, మర్రిపూడి జెడ్పీటీసీ మాకినేని సుధారాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు పోలు వరలక్ష్మి, నాగులుప్పలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ, టంగుటూరు జెడ్పీటీసీ మన్నం అరుణకుమారి, కనిగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పులి శాంతి, కౌన్సిలర్ తమ్మినేని సుజాత, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత, కోఆప్షన్ మెంబర్ షేక్ రషీదా, కౌన్సిలర్ వెన్నపూస కుమారి, మహిళా నాయకులు పేరం ప్రసన్న, వడ్లమూడి వాణి, బడుగు ఇందిర, మేరికుమారి, సయ్యద్ అప్సర్, బత్తుల ప్రమీల, బడుగు శోభలత, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


