పొన్నలూరు: మండలంలోని మాలపాడు శివారు అటవీ ప్రాంతంలో కోడిపందేల శిబిరంపై శనివారం పోలీసులు దాడి చేసి 23 మందిని అరెస్టు చేశారు. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో కొండపి సీఐ సోమశేఖర్, మర్రిపూడి, కొండపి ఎస్సైలు రమేష్, ప్రేమ్‌కుమార్‌లు తమ సిబ్బందితో కలిసి శిబిరంపై దాడి చేశారు. పట్టుబడిన వారి నుంచి రూ.42,860 నగదుతో పాటు మూడు కోళ్లు, 18 బైకులు, 23 సెల్‌ఫోన్లు స్వాధినం చేసుకుని పొన్నలూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు.


