రెండుమూడు నెలల్లోనే పూర్తి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

రెండుమూడు నెలల్లోనే పూర్తి చేస్తాం

Mar 9 2026 7:44 AM | Updated on Mar 9 2026 7:44 AM

రెండుమూడు నెలల్లోనే పూర్తి చేస్తాం ● యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన కలెక్టర్‌

● యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన కలెక్టర్‌

మేదరమెట్ల: కొరిశపాడు మండలంలో నిర్మాణంలో ఉన్న యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులను రెండుమూడు నెలల్లోనే పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని కలెక్టర్‌ పీ రాజాబాబు తెలిపారు. పథకానికి సంబంధించిన రిజర్వాయర్‌ను అధికారులతో కలిసి కొరిశపాడులో ఆదివారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పథకం చాలా వరకు పూర్తయిందని, కొద్దిమేర పనులే మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా మూడు నెలల్లోపే పూర్తి చేసి పథకాన్ని వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేసేందుకు, ముంపునకు గురైన గ్రామానికి నష్టపరిహారాన్ని అందజేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. కలెక్టర్‌ వెంట ప్రాజెక్టు ఎస్‌ఈ అబూత్‌అలీం, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయజ్యోతి, త హసీల్దార్‌, ఎంపీడీవో, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement