ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా కల్తీ పాల తయారీ కుటీర పరిశ్రమగా ఇళ్లలోనే తయారీ సెంట్రలైజ్డ్ డెయిరీలకు తరలింపు నాణ్యత పరిశీలన శూన్యం మొక్కుబడి తనిఖీలకే అధికారులు పరిమితం కల్తీ పాలపై ప్రభుత్వ చర్యలు శూన్యం జిల్లాలో 6.5 లక్షల పశువులు, 1.3 లక్షల మంది పాడి రైతులు
న్యూస్‌రీల్
అబద్ధాలకు కేరాఫ్.. చంద్రబాబు
సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని మరిచి అబద్ధాలతో పరిపాలన సాగిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు.
ఉదయం పొగమంచు ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాతావరణం వేడిగా ఉంటుంది.
పోషకాలు అందించే పాలు కాలకూట విషంగా మారుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నిత్యం తాగే పాలు కల్తీ జరుగుతుండటంతో ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిన దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. కొందరు స్వార్థపరులు కల్తీ పాలు సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో ఎక్కువగా కల్తీ పాలను కుటీర పరిశ్రమలా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతున్నాయి.
గేదెల ఫారాలు ఉన్న ప్రాంతంలో కల్తీ పాల తయారీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంగా పంపిణీ చేసే సెంట్రలైజ్డ్ కార్పొరేట్ డెయిరీలకు ఈ కల్తీ పాలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏవి కల్తీ పాలు? ఏవి నిజమైన పాలు? కనిపెట్టలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. సేకరణ కేంద్రాల వారు కూడా తమ కమీషన్ తమకు వస్తుంది కదా అని కళ్లు మూసుకుని అలాగే ఆ పాలను సెంట్రలైజ్డ్ డెయిరీలకు తరలించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో కుటీర పరిశ్రమలా కల్తీ పాలు తయారయ్యేవి. దీనికితోడు అప్పట్లో తక్కువ ధరకు వస్తుందని బీరు పొట్టు వేసి పాడి పశువులను మేపే వారు. బీరు పొట్టు మేసిన గేదెలు నాణ్యత లేని పాలు ఇవ్వడమే కాకుండా వాటి జీవిత కాలం కూడా తగ్గిపోయేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం కల్తీ పాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కల్తీ పాల జాడ కూడా కనిపించకుండా పూర్తిగా కట్టడి చేసింది. బీరు పొట్టు కూడా గేదెలకు వేయకుండా పూర్తి స్థాయిలో నియంత్రించింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కల్తీ పాల తయారీకి అడ్డే లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
క్షీర సాగరళం
దర్శి:
రాష్ట్రంలో పాల సేకరణలో ఉమ్మడి జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో ప్రముఖ డెయిరీలతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 72 బల్క్ మిల్క్ యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు 147 డైయిరీలు, 760 వరకు పాల కేంద్రాలు ఉన్నాయి. అనధికారికంగా పాలకేంద్రాలు పదివేలకుపైగా ఉంటాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 6.5 లక్షల పశువులు ఉన్నాయి. అందులో గేదెలు ఆరు లక్షలు, 50 వేలకుపైగా ఆవులు ఉన్నాయి. పాడి రైతులు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు. రోజుకు సరాసరి 23 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది.
కుటీర పరిశ్రమలా..
ఉమ్మడి జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు దర్శి, ముండ్లమూరు, సంతమాగులూరు, అద్దంకి తదితర మండలాల్లో కల్తీ పాలను కుటీర పరిశ్రమలా ఇళ్లలోనే తయారు చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో సుమారు 1200కుపైగా చిన్నాపెద్దా డెయిరీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు పాలు విక్రయించేవి సుమారు 80కిపైగా ఉంటాయి. ఇక్కడ తరచూ కల్తీ పాల తయారీ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అధికారులు వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. మొక్కుబడి దాడులతో సరిపెడుతూ తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మేల్చూరులోని పాలకేంద్రంపై అధికారులు దాడులు చేశారు. ఇంట్లోనే కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వారిపై కేసులు పెట్టినా ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. రాజమండ్రి కల్తీ పాల ఉదంతాన్ని చూసి కూడా అధికారుల్లో చలనం కనిపించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాల కల్తీ ఇలా...
యూరియా, పాలపొడి, సన్ ఫ్లవర్ ఆయిల్‌ను బాగా మిక్స్ చేస్తారు. వాటిలో నీళ్లు కలిపి కొన్ని మంచి పాలు కలిపి కల్తీ పాలు తయారు చేస్తారు. అనుకున్న ఫ్యాట్ వచ్చే మోతాదులో పాలు తయారు చేస్తారు. పాల కేంద్రాల్లో ఉండే సాధారణ మిల్క్‌టెస్టర్‌లో టెస్ట్ చేసినా తేడా కనిపించకుండా ఉండేందుకు పాల పొడి కలిపి ఎస్‌ఎన్‌ఎఫ్, వెన్నశాతం సమానంగా కనిపించేలా చేస్తారు. అయితే ప్రస్తుతం నూతన టెక్నాలజీతో వచ్చిన మిషన్‌లు యూరియా, పాల పొడి కల్తీ ఉన్నట్లు గుర్తిస్తున్నాయి. దీంతో కేవలం సన్‌ఫ్లవర్ ఆయిల్‌తోనే పాలు తయారు చేస్తున్నారు. దీంతో ఇక్కడ మిషన్లు ఆ కల్తీ పాలను పూర్తిస్థాయిలో కనిపెట్టలేకపోతున్నాయి. అవి కనిపెట్టే పరికరాలు రాష్ట్రంలో ఎక్కడా లేవని, అవి హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. ప్రతిరోజూ ఒక్కో పాల డెయిరీకి రెండు మూడు వందల క్యాన్‌లలో పాలు వస్తాయి. అయితే వాటన్నింటినీ పరిశీలించాలంటే సాధ్యం కాదు. దీంతో డెయిరీ యజమానులు కూడా చేతులెత్తేయాల్సి వస్తోంది.
మొక్కుబడిగా తనిఖీలు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ పాలపై అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే టీడీపీకి చెందిన కీలక నేతల కనుసన్నల్లో పలు డెయిరీలు నడుస్తున్నాయి. దీంతో సంబంధిత అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పటికై నా ప్రభుత్వం కల్తీ పాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్యం కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.


