రెండు బ్యారెన్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

రెండు బ్యారెన్లు దగ్ధం

Mar 16 2026 7:41 AM | Updated on Mar 16 2026 7:41 AM

రెండు బ్యారెన్లు దగ్ధం సర్పంచ్‌లను ఇన్‌చార్జిలుగా నియమించాలి

రూ.14 లక్షల ఆస్తి నష్టం

వలేటివారిపాలెం: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు బ్యారెన్ను దగ్ధమయ్యాయి. ఈ సంఘటన వలేటివారిపాలెంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..వలేటివారిపాలెం గ్రామానికి చెందిన వలేటివారిపాలెం శ్రీధర్‌నాయుడు, వలేటి మధుసుదన్‌రావుకు సంబంధించిన రెండు బ్యారన్‌లో పొగాకు క్యూరింగ్‌ చేస్తుండగా శ్రీధర్‌నాయుడుకు బ్యారన్‌లో అల్లుడు కర్ర జారీ మొద్దు గొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. పంటలు పక్కనున్న బ్యారన్‌కు కూడా వ్యాపించడంతో రెండు బ్యారెన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు కందుకూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటాన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే రెండు బ్యారెన్‌లలోని టైర్లు, క్రరలు, మొద్దు గొట్టాలు, పొగాకు మొత్తం కాలిపోయాయి. ప్రమాదంలో సుమారు రూ.14 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యజమానులు వాపోయారు.

ఒంగోలు టౌన్‌: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను తీసుకొస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని, ఎన్నికలు నిర్వహించే వరకు పంచాయతీ సర్పంచ్‌లనే ఇన్‌చార్జిలుగా నియమించాలని సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి.వీరభద్రాచారి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లకోసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించడం కుదరనప్పుడు ప్రజల తరఫున సర్పంచ్‌లను కొనసాగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. 2000లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైకోర్టు ఆదేశాల మేరకు సర్పంచ్‌లను ఇన్‌చార్జిలుగా కొనసాగించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేక పాలన కొనసాగించారని, తద్వారా గ్రామ పంచాయతీలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారులున్నా ప్రజల తరఫున సర్పంచ్‌లను ఇన్‌ చార్జిలుగా కొనసాగించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement