న్యూస్‌రీల్
పేద రోగుల ప్రాణాలకు అండగా ఉండాల్సిన జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో నాడిపట్టే నాథుడు లేక రోగులు అల్లాడుతున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో సీనియర్ వైద్యులు, హెచ్‌ఓడీలు హాజరుకే పరిమితమై..రోగులను జూనియర్లకు అప్పగిస్తుండగా.. మార్కాపురం జిల్లా వైద్యశాలలో అసలు వైద్యులే లేకుండా పోయారు. మౌలిక వసతుల కొరతా వేధిస్తోంది. మందులు కూడా బయట కొనుక్కోవాల్సి వస్తోంది. జిల్లా వైద్యశాలలపై సాక్షి విజిట్...
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ వైద్యశాలకు ఎంతో నమ్మకంతో పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యసేవలు కోసం దూరప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే గతంలో ఉన్న స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతోపాటు ఉన్న వైద్యులను, వైద్య సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో వైద్యశాలకు రోగులు అంతంతమాత్రంగా వస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలపై నమ్మకం కలిగించి వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. సరైన వైద్యం అందక నగదు చెల్లించి ప్రైవేటు వైద్యశాలను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– గొలమారి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీపట్టణ ప్రధాన కార్యదర్శి


