పదిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

పదిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Mar 6 2026 8:06 AM | Updated on Mar 6 2026 8:06 AM

బేస్తవారిపేట: పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గీత అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్‌, పాపాయిపల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ పక్కాగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతుల విద్యార్థులను గణితంపై ప్రశ్నలు అడిగారు. ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థులు టేబుల్స్‌ 20 వరకు, 5 వేల వరకు అంకెలు, చదవడం, రాయడం చక్కగా నేర్చుకోవాలన్నారు. చిన్నారులతో బోర్డుపై గణితంపై పలు ప్రశ్నలడిగి సమాధానాలు రాయించారు. బోర్డ్‌పై అంకెలను రాసి ఎలా నేర్చుకోవాలో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఎన్‌ మధుసూదన్‌రెడ్డి, చేగిరెడ్డి రమణారెడ్డి, హైస్కూల్‌ హెచ్‌ఎం ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement