– ఒంగోలు సిటీ
28,302
పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 165 పరీక్ష కేంద్రాల్లో 28,302 మంది విద్యార్థులు హాజరయ్యారు. 28,465 మందికిగానూ 163 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సి.వి.రేణుక తెలిపారు. కలెక్టర్ పి.రాజాబాబు మూడు పరీక్ష కేంద్రాలను, జిల్లా పరిశీలకులు ఆరు పరీక్ష కేంద్రాలను, డీఈఓ రేణుక ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. 13 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు మొత్తం 86 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. మార్కాపురం జిల్లా పరిశీలకులు ఐదు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. డైరెక్టరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ వారి కార్యాలయం నుంచి స్పెషల్ స్క్వాడ్ అధికారి 7 కేంద్రాలను పరిశీలించారు. మొదటి రోజు మొత్తం 113 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.


