టీటీడీ చైర్మన్‌ను తక్షణమే తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ను తక్షణమే తొలగించాలి

Mar 18 2026 7:38 AM | Updated on Mar 18 2026 7:38 AM

ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు డిమాండ్‌

ఒంగోలు సిటీ: టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వికృత లీలలను ప్రజలందరూ చూశారని, తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు డిమాండ్‌ చేశారు. ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు, వైఎస్సార్‌ సీపీ నాయకులతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకుల ప్రవర్తనను, అకృత్యాలను, వికృత చేష్టలను, అఘాయిత్యాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. గంజాయి తాగే ఎంపీలు, బీఆర్‌ నాయుడు లీలలను చూశారన్నారు. ఇంత బరితెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవర్తిస్తుంటే జనసేన ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీ్త్రల పట్ల మాకు గౌరవం ఉందని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు సీ్త్రలను అవమాన పరుస్తున్న, సీ్త్రలను బ్లాక్‌మెయిల్‌ చేసేవారిని, మానభంగాలు చేసేవారిని, కించపరిచేవారిని పెట్టి పాలనను కొనసాగిస్తుంటే ప్రజలు వింతగా చూస్తున్నారన్నారు. టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలని మహిళలు నిరసన తెలుపుతుంటే మహిళలను నెత్తురు వచ్చేలా పిడిగుద్దులు గుద్దారన్నారు. అటువంటి వ్యక్తి దేవస్థానానికి అర్హుడు కాదని, తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్‌, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement