న్యూస్‌రీల్
ఉప్పు కొఠారులలో ఉప్పు తయారీ
పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఉమ్మడి జిల్లా ఉప్పురైతుల బతుకుల్లో మంటలు రేపుతున్నాయి. ఎగుమతులు ఆగిపోవడంతో ఉప్పు ధరలు కుప్పకూలి రైతు ఆందోళనలో మునిగిపోయాడు. యుద్ధం కారణంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లు నిలిపివేయడంతో చాలా రాష్ట్రాల్లో చిన్నా పెద్దా హోటల్స్ మూతపడుతున్నాయి. ఫలితంగా ఉప్పు కొనేవారులేక డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు రైతుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రెండేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతుకు యుద్ధం శాపంలా పరిణమించింది. యుద్ధానికి ముందు ఉప్పు బస్తా (75 కేజీ) ధర రూ.280 ఉండగా నేడు అమాంతం రూ.200లకు పడిపోయింది.


