న్యూస్‌రీల్
నత్తనడకన సాగుతున్న రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్ వంటి కీలక నిర్మాణ పనుల్లో అలసత్వం పనులు ఎప్పటికి పూర్తవుతాయో కచ్చితంగా చెప్పలేని స్థితిలో అధికారులు పోర్టు పనుల పూర్తిపై పదేపదే తేదీలు మారుస్తున్న ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్ సీపీ హయాంలో జెట్ స్పీడ్‌తో 60 శాతం పనులు పూర్తి
చిల్లకర్ర కొట్టడానికి కూలీలు వెళ్తున్న ఆటోను కారు ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. పొగమంచు కురుస్తుంది.
జిల్లా అభివృద్ధికే కాదు, రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వంలో గ్రహణం పట్టుకుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2024 చివరి నాటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో సాగిన పోర్టు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తిగా పడకేశాయి. ఈ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. కీలకమైన బెర్తుల నిర్మాణం, డ్రెజ్జింగ్, బ్రేక్‌వాటర్ ఫీడర్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి కీలక పనుల్లో అడుగు ముందుకు పడడం లేదు. దీంతో పోర్టు ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియని ప్రశ్నగా మిగిలింది. కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పోర్టు ప్రారంభంపై నెలకో తేదీ చెప్తూ కాలయాపన చేస్తున్నారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే తేదీలపై అటు మారిటైంబోర్డు అధికారులు, ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన మారిటైంబోర్డు అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పోర్టు అందుబాటులోకి వస్తుందని ప్రకటిస్తే, ఇటీవల పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామంటూ ప్రకటించారు. దీంతో పోర్టు పనుల పూర్తిపై ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. వాస్తవానికి అక్కడ జరుగుతున్న పనుల వేగాన్ని బట్టి చూస్తే మరో రెండు, మూడేళ్లకు కూడా పోర్టు నిర్మాణ పనులు పూర్తికావనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా కీలకమైన బెర్తుల నిర్మాణం (ఫైల్)
పోర్టుకు సర్కారు పోటు


