హోరాహోరీగా ఎడ్ల పందేలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా ఎడ్ల పందేలు

Mar 14 2026 7:22 AM | Updated on Mar 14 2026 7:22 AM

కొనకనమిట్ల: వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడో రోజు శుక్రవారం జాతీయ స్థాయి సీనియర్‌ విభాగం ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. మేకలవారిపల్లి రెడ్ల సంఘం, బొమ్మన బ్రదర్స్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఎడ్ల పోటీలను ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడి్‌డ్‌ ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన 14 జతల ఎడ్లు హోరాహోరీగా తలపడ్డాయి. సేద్యపు ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన పశుపోషకులు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. రిఫరీగా వల్లెల వెంకటరామిరెడ్డి, నారాయణస్వామి వ్యవహరించారు.

న్యూ కేటగిరీ విజేతలు ఇవే..

గురువారం రాత్రి వరకు కొనసాగిన న్యూ కేటగిరీ విభాగంలో ఆర్‌కే బుల్స్‌ అత్తోటి శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి సంయుక్త ఎడ్ల జత నిర్ణీత సమయంలో 6,420 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.75 వేలు, గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఎడ్ల జత 6,252 లడుగులు లాగి రెందో బహుమతి రూ.60 వేలు, నాగార్‌ కర్నూలుకు చెందిన అక్షరరెడ్డి ఎడ్ల జత 6,236 అడుగులు లాగి మూడో బహుమతి రూ.40 వేలు, గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 6 వేల అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.30 వేలు, గుంంటూరు జిల్లాకు చెందిన గుదిడండ మాధవరెడ్డి, పెద్దపరిమి శ్రీనివాస్‌ సంయుక్త ఎడ్ల జత 5,464 అడుగులు లాగి ఐదో బహుమతి రూ.20 వేలు, యర్రగొండపాలేనికి చెందిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 5,400 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.15 వేలు, పుల్లలచెరువుకు చెందిన ఎడ్ల జత 4,724 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.8 వేలు గెలుపొందాయి. దాతల సహకారంతో విజేతలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుందురు కాశిరెడ్డి, ఆలయ ఈఓ ఈఓ చెన్నకేశవరెడ్డి చేతులమీదుగా నగదు అందజేశారు.

సీనియర్‌ విభాగంలో కృష్ణా జిల్లా ఎడ్ల సత్తా

సీనియర్‌ విభాగం ఎడ్ల పోటీల్లో కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన రాజా చౌదరి, మోహన్‌రావు సంయుక్త ఎడ్ల జత 4,200 అడుగులు లాగి మొదటి బహుమతి రూ.90 వేలు. నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి కేశవరెడ్డి, సాంబశివారెడ్డి, వీరనరసింహరెడ్డి ఎడ్ల జత 4,022 అడుగులు లాగి రెండో బహుమతి రూ.70 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లా చౌటపల్లికి చెందిన మార్తాల చంద్ర ఓబులరెడ్డి ఎడ్ల జత 3,874 అడుగులు లాగి మూడో బహుమతి రూ.50 వేలు, బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణచౌదరి ఎడ్ల జత 3,694 అడుగులు లాగి నాలుగో బహుమతి రూ.40 వేలు, వీరికే చెందిన మరో జత ఎడ్లు 3634 లాగి ఐదో బహుమతి రూ.30 వేలు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎడ్ల జత 3,602 అడుగులు లాగి ఆరో బహుమతి రూ.20 వేలు, బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి చౌదరి ఎడ్ల జత 3,451 అడుగులు లాగి ఏడో బహుమతి రూ.10 వేలు అందుకున్నాయి. మూడు రోజులపాటు ఎడ్ల పందేల్లో పాల్గొని బహుమతి దక్కని ప్రతి ఎడ్ల జతకు రూ.5 వేల చొప్పున కాసు చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement