కాపుల అభ్యున్నతికి జగన్‌ కృషి | - | Sakshi
Sakshi News home page

కాపుల అభ్యున్నతికి జగన్‌ కృషి

Mar 8 2026 7:25 AM | Updated on Mar 8 2026 7:25 AM

కాపు నాయకులతో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు సిటీ: కాపు కులస్తుల అభ్యున్నతికి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశేషంగా కృషి చేశారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. ఒంగోలులోని ఆయన నివాసంలో శనివారం కాపు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబును సన్మానించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ బలోపేతానికి కాపు నాయకులంతా సమష్టిగా, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాపుల అభివృద్ధి కోసం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కాపునేస్తం పథకాన్ని ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, 38, 32, 34 డివిజన్ల అధ్యక్షులు పాలడుగు శ్రీనివాసరావు, పసుపులేటి నవీన్‌కుమార్‌, బండారు ప్రభాకరరావు, ఒంగోలు నియోజకవర్గ యూత్‌ ప్రెసిడెంట్‌ మల్లిశెట్టి దేవా, జిల్లా యూత్‌ జనరల్‌ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్న, జిల్లా డిసిప్లినరీ కమిటీ మెంబర్‌ రాయిని వెంకట్రావు, 36వ డివిజన్‌ యూత్‌ నాయకుడు హరీష్‌ కుమార్‌, 25వ డివిజన్‌ యూత్‌ నాయకుడు బండారు రాఘవేంద్ర, యూత్‌ సిటీ జనరల్‌ సెక్రటరీ అమెజాన్‌ ప్రశాంత్‌, 25వ డివిజన్‌ నాయకులు మల్లికార్జునరావు, కోవూరు కృష్ణ, అయినాబత్తిని సాయిబాబు, పడే దుర్గా, 37వ డివిజన్‌ యూత్‌ జనరల్‌ సెక్రటరీ కొండాదాసు, కిరణ్‌ కుమార్‌, సాయి తేజ, 37వ డివిజన్‌ నాయకుడు తోట బాబీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement