వచ్చే ఎన్నికల్లో మన సత్తాచాటాలి.. మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల
కొనకనమిట్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడుతున్నాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మునగపాడులో చౌడేశ్వరి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై వారు మాట్లాడారు. చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని మాయ మాటలతో గద్దెనెక్కిన చంద్రబాబు అవేమీ అమలు చేయకుండా మరోమారు ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. గత జగనన్న పాలన సంక్షేమ పథకాలతో అభివృద్ధి పరుగులు పెడుతూ ప్రతిరోజూ పండగలాగే ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిసలు కృషి చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మనమందరం అండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అన్నా, ఉడుముల పిలపునిచ్చారు. విద్యుత్ ప్రభ ఏర్పాటు చేసిన మునగపాడు సర్పంచ్ పార్లపల్లి సిద్దానభి, పార్టీ నాయకులు గర్రె శ్రీనివాసులు, బాలపిచ్చయ్య, చంద్రశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కామసాని వెంకటేశ్వరరెడ్డి, వెలిగండ్ల సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గర్రె కుసమ కుమారి శ్రీనివాసులు, భత్తుల రవియాదవ్ పార్టీ అనుబంద విభాగాల సభ్యులు ఏలూరి సంజీవరెడ్డి, పావులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


