కురిచేడు: ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన నెల రంజాన్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. స్థానిక మదర్సాలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ముస్లింలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ వారి అభివృద్ధికి సహకరించామన్నారు. చంద్రబాబు సర్కారు అందరితో పాటు ముస్లింలను కూడా మోసం చేసిందని విమర్శించారు. రానున్న రోజుల్లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ చేతుల మీదుగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యన్నబత్తుల వెంకట సుబ్బయ్య, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు మేరువ సుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ షేక్ ఖాశీం, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, లీగల్ సెల్ నాయకులు పసుమర్తి వెంకటరావు, వైస్ ఎంపీపీ షేక్ చిన్న మస్తాన్, ఎన్‌వీ నాగిరెడ్డి, నుసుం ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గోగులముడి లింగారెడ్డి, బోరిగర్ల శ్రీను, సాదం నారయ్య, గొట్టిపాటి బాలకోటయ్య, షేక్ జానీ, షేక్ సుభాని, షేక్ నాయబ్ రసూల్, షేక్ యూసఫ్, కండె గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి


