వివిధ హోదాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వివిధ హోదాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల నియామకం

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

వివిధ హోదాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల నియామకం ఏసీబీ డీఎస్పీగా శిరీష వర్క్‌ ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేయాలి

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వారు వరుసగా స్టేట్‌ స్టూడెంట్‌ వింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా దర్శికి చెందిన దుగ్గిరెడ్డి నారాయణరెడ్డిని, స్టేట్‌ స్టూడెంట్‌ వింగ్‌ జనరల్‌ సెక్రటరీగా కనిగిరికి చెందిన మునగాల హరీశ్వరరెడ్డిని, స్టేట్‌ సోషల్‌ మీడియా వింగ్‌ సెక్రటరీగా మార్కాపురానికి చెందిన దగ్గుల సాగర్‌రెడ్డిని, స్టేట్‌ యూత్‌ జాయింట్‌ సెక్రటరీగా మార్కాపురానికి చెందిన గాయం వెంకటేశ్వరరెడ్డిని నియమించినట్లు తెలిపారు. అలాగే జిల్లా నూర్‌బాషా/దూదేకుల విభాగం ప్రెసిడెంట్‌గా కొండపికి చెందిన షేక్‌ రజియా హుస్సేన్‌ను, జిల్లా బీసీ సెల్‌ సెక్రటరీగా కనిగిరికి చెందిన వంకదారి వెంకటరాజా నియమించారు. అలాగే ఒంగోలు సిటీ మహిళా విభాగం ప్రెసిడెంట్‌ గా ఒంగోలుకు చెందిన ఎస్‌కే.రషుదా, ఒంగోలు నియోజకవర్గ మహిళా విభాగం ప్రెసిడెంట్‌ గా ఒంగోలుకు చెందిన బడుగు మాధవీలతను నియమించారు.

ఒంగోలు సిటీ: ఒంగోలు ఏసీబీ డీఎస్పీగా ఎస్‌.శిరీష శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరుగుతోందన్నారు. పింఛన్లు, రేషన్‌, భూమి సమస్యలు, మున్సిపల్‌ సేవలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాల్లో కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు ఇస్తే వారి పనులు తాము దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా చేయిస్తామని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు ఇవ్వాలన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగినట్లయితే వెంటనే 9440446189, 9440446187, 8333925624 నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చాన్నరు. మీ వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచుతారని చెప్పారు.

మార్కాపురం టౌన్‌: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో వర్క్‌ ఔట్‌సోర్సింగ్‌ పేరుతో అన్ని విభాగాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధమైందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్క్‌ ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను మున్సిపల్‌ కార్మికులకు వెంటనే అమలు చేయాలని, ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బరాయుడు, జీ హరి, చెన్నకేశవులు, చిన్నరాయుడు, శ్రీను, దాసు, రషీదు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement