స్వాహా..! | - | Sakshi
Sakshi News home page

స్వాహా..!

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

స్థానికం

విలువైన భూముల్లో వాలేందుకు సిద్ధమైన పచ్చ గద్దలు

స్థానికం
శోత్రియం భూములు

అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి

అధికారులకు కలెక్టర్‌ విజయసునీత ఆదేశం

మార్కాపురం: మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు సంతృప్తికరంగా పనిచేయాలని, పారిశుధ్యం, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని, పాఠశాలలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను సీజన్‌ నాటికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నెలలో నాలుగు శుక్రవారాలు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ పులి శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ మోహన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీ పద్మావతి, మైక్రో ఇరిగేషన్‌ పీడీ జెన్నెమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

హైవేపై కారు దగ్ధం

జేసీబీని ఢీకొనడంతో పేలిన పెట్రోల్‌ ట్యాంక్‌

త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద సంఘటన

త్రిపురాంతకం: వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టడంతో పెట్రోల్‌ ట్యాంకర్‌ పగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతపురం–అమరావతి జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన రామచంద్రరావుతోపాటు మరో నలుగురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో రాజుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న జేసీబీని ఢీకొట్టారు. జేసీబీ తొట్టి కారు వెనుక భాగంలోని పెట్రోల్‌ ట్యాంక్‌కు బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు హుటాహుటిన కిందకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. అందరూ చూస్తుండగానే కారు మంటల్లో కాలిపోయింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు.

టీడీపీ నాయకుడి

జోక్యంతోనే భూకబ్జాకు దిగారు

నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుని జోక్యంతోనే తమ గ్రామానికి చెందిన కొంతమంది భూ కబ్జాకు పాల్పడుతున్నారు. పోలీసులను పురమాయించి మమ్మల్ని హెచ్చరించారు. భూమిపై ఎటువంటి అధికారంలేని వారు గతంలో మాకు పట్టాలు ఇచ్చిన భూమిలో దిగి జేసీబీలతో శుభ్రం చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన వారికి అధికారులు మద్దతు ఇస్తే పేదల పరిస్థితి ఏం కావాలి.

– ఎనిబెర ప్రసాద్‌, బాధితుడు, నడిగడ్డ

పట్టాలు ఎలా రద్దు చేస్తారు

మాకు 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు ఏ విధంగా రద్దు చేస్తారు. అందుకు సంబంధించిన నోటీసు కూడా మాకు అందలేదు. మా పట్టా భూమిలో ఇతరులు దిగి శుభ్రం చేసుకుంటుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. తాము వ్యవసాయం చేసుకుంటామంటే బెదిరిస్తున్నారు. వెంటనే కలెక్టర్‌ జోక్యం చేసుకొని న్యాయం చేయాలి.

– నూనె ఏలియా, బాధితుడు, నడిగడ్డ

నా భూమికి హద్దులు చూపించాలి

నాకు 20 సంవత్సరాల క్రితం పొలం పట్టా ఇచ్చారు. అప్పట్లో నేను వ్యవసాయం చేసుకునేదానిని. కొంతమంది బెదిరించి భూమిలో దిగకుండా చేశారు. అప్పటి నుంచి వ్యవసాయం చేయకపోవడం వలన చిల్లచెట్లు ఏపుగా పెరిగాయి. భూమి ఎక్కడ ఉందో గుర్తించలేకపోతున్నాం. గతంలో మాకు పట్టా ఇచ్చిన ప్రకారం 50 సెంట్ల భూమికి హద్దులు చూపించాలి.

– నూనె ఎలిశమ్మ, బాధితురాలు

యర్రగొండపాలెం:

రీదైన శోత్రియం భూములు కాజేసేందుకు పచ్చ నేతలు బరి తెగించారు. అధికారం చేతిలో మదంతో.. ఏం చేసినా అడిగేవారు లేరన్న అహంకారంతో టీడీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు. శోత్రియం భూములపై ఎటువంటి హక్కు లేకపోయినప్పటికీ దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి చదును చేయిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం భూమిలేని పేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు అంటూ ఆర్డీఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయించడం టీడీపీ నేతల భూదాహానికి నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాంతకం మండలంలోని ముక్తింపురం(నడిగడ్డ)లో 1 నుంచి 35 వరకు ఉన్న సర్వే నంబర్లలో దాదాపు 380 ఎకరాల పొలం ఉంది. దీనిని శోత్రియం భూమిగా గతంలోనే ప్రభుత్వం గుర్తించింది. 2006లో 3వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నడిగడ్డలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ రైతులతోపాటు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి 50 సెంట్ల ప్రకారం అప్పటి కలెక్టర్‌ ఉదయలక్ష్మి 120 ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పొందిన రైతులు 2008 వరకు ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నడిగడ్డ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు కోర్టుకు వెళ్లి స్టేటస్‌కో తీసుకొచ్చారు. దీంతో అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్‌ పొలంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, అప్పటి వరకు పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న అర్హత కలిగిన రైతులపై కేసులు పెట్టారు. ఈ వివాదం జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లింది. ఒక వర్గంవారిపైనే ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చిందని అధికారులను మందలించి, తప్పుడు కేసులను ఎత్తివేయించారు. ఆ తరువాత రెండో వర్గం వారు తరచూ బెదిరిస్తుండటంతో పట్టాలు పొందిన రైతులు తమ పొలంలోకి అడుగుపెట్టలేకపోయారు. అప్పట్లోనే టీడీపీ వర్గీయులు లాయర్‌ ద్వారా కోర్టు నోటీసులు ఇప్పించారు. గత్యంతరం లేని స్థితిలో రైతులు కూడా లాయర్‌ ద్వారా కోర్టులో తమ వాదన వినిపించారు. ఈ కేసును రిజర్వులో పెట్టిన కోర్టు, సమగ్రంగా విచారణ జరపాలని అప్పటి జేసీకి ఆదేశాలు జారీచేసింది. రెండు వర్గాలను జేసీ పిలింపించి విచారించారు. ఈ సమయంలో తమ వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ఆయన కోరారు. రైతులు తమ వద్ద ఉన్న 3వ విడత కింద కలెక్టర్‌ పంపిణీ చేసిన పొలం పాస్‌పుస్తకాలు, పట్టాలు చూపించారు. రెండో వర్గం వారు మాత్రం ఆ భూమిపై హక్కు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు కూడా 380 ఎకరాల్లో పూర్తిగా పట్టాలు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వివాదాన్ని జేసీ పెండింగ్‌లో పెట్టారు. తమకు అనుకూలంగా జేసీ నడుచుకోలేదన్న దుగ్ధతో రెండో వర్గం మరోమారు కోర్టును ఆశ్రయించింది. జేసీ ఈ కేసును సమగ్రంగా విచారించలేదని ఆరోపిస్తూ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకుడి జోక్యంతో ఆర్డీఓ ద్వారా ఆ భూమిపై ప్రొసీడింగ్స్‌ ఇప్పించారు. టీడీపీ ముఖ్యనేత ఆదేశాలతోనే త్రిపురాంతకం సీఐ, ఎస్సై నడిగడ్డకు వచ్చి శోత్రియం భూముల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించి, తమ భయభ్రాంతులకు గురిచేశారని పట్టాలు పొందిన రైతులు ఆరోపిస్తున్నారు. తమకు పట్టాలు ఇచ్చిన భూమి కాకుండా అక్కడ మరో 260 ఎకరాల వరకు భూమి ఉందని, పేదలకు దక్కాల్సిన భూమిని అధికార టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అధికారులంతా సిద్ధమయ్యారని మండిపడుతున్నారు.

భూమిపై హక్కుఉన్నట్లు పట్టాలు చూపిస్తున్న బాధితులు

భూ హక్కున్న వారిని హెచ్చరిస్తున్న పోలీసులు

2006లో పట్టాలు పంపిణీ చేస్తున్న అధికారులు

ఘనంగా బూచేపల్లి సుబ్బారెడ్డి వర్ధంతి

20 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాలు రద్దు అంటూ తప్పుడు ప్రచారం

టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులు

అనుమతి లేకున్నా జేసీబీలతో భూములు చదును చేస్తున్న వైనం

అయినా అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు

తమకు ఇచ్చిన పట్టాలకు భూమి చూపాలని అడుగుతున్న బాధితులు

Advertisement
 
Advertisement
Advertisement