ప్రస్తుతం తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఉదయం 11 గంటలు దాటితే బయటకు రాకుండా ఉండటం మంచిది. వడదెబ్బకు గురైతే ప్రాణాంతకం కావచ్చు. వీలైనంత వరకూ మంచినీరు, కొబ్బరినీరు, పండ్ల రసాలు తరచూ తీసుకోవాలి. రోడ్డుమీద అమ్మే వివిధ రకాల రంగుపానీయాలు తీసుకోవద్దు. కలుషిత ఆహారం, రోడ్డుపై అమ్మే జంక్ ఫుడ్స్ తినవద్దు. కూలి పనులు చేసేవారు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే గొడుగు, టోపీతో పాటు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవాలి. వడగాడ్పులు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– మనష్యే, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, మార్కాపురం


