ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

పొదిలి సమీపంలో బైక్‌ను ఢీకొట్టిన కారు

పొదిలి రూరల్‌: వేగంగా వెళ్తున్న కారు, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పొదిలి మండలంలోని మాదాలవారిపాలెం–సలకనూతల గ్రామాల మధ్య బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం, దేవరపాలెం గ్రామాలకు చెందిన ఐదుగురు యవకులు రెండు ద్విచక్ర వాహనాలపై శ్రీశైలం వెళ్తున్నారు. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు మార్గమధ్యంలో సలకనూతల సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దేవరపాలేనికి చెందిన పుత్తూరి అనీల్‌(22) అక్కడకక్కడే మృతి చెందగా గోగినేనివారిపాలేనికి చెందిన దాసరి అంకబాబు(20)కు తీవ్రగాయాలయ్యాయి. మరో బైక్‌పై వెళ్తున్న యువకులు 108కు సమాచారం ఇవ్వగా.. క్షతగాత్రుడు అంకబాబును పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో తలమల్ల సమీపంలో అంకబాబు మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు బైకు ముందు టైరు వేరుపడి కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో పొదిలి పర్యటనకు వస్తున్న కలెక్టర్‌ విజయసునీత సంఘటన స్థలంలో ఆగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సూరెడ్డి రాజేష్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమి త్తం పొదిలి వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతులు ఇరువురూ బావబామ్మర్ది కొడుకులు. మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో పొదిలి ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది.

Advertisement
 
Advertisement
Advertisement