పొగాకు రైతు పోరుబాట | Tobacco Farmers fires on Chandrababu Government: Prakasam District | Sakshi
Sakshi News home page

పొగాకు రైతు పోరుబాట

May 12 2026 5:19 AM | Updated on May 12 2026 5:19 AM

Tobacco Farmers fires on Chandrababu Government: Prakasam District

వెల్లంపల్లి వేలం కేంద్రం వద్ద పొగాకు రైతులతో మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

ప్రకాశం జిల్లా వెల్లంపల్లి కేంద్రంలో వేలం నిలిపేసిన రైతులు

మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నోబిడ్ల వంకతో 70 శాతం పొగాకు బేళ్లను వెనక్కి పంపిస్తుండడంతో రైతులు ఆగ్రహంతో సోమవారం వేలం నిలిపేశారు. చండ్రపాడు, గాడిపర్తివారిపా­లెం గ్రామాలకు చెందిన దాదాపు 350 మందికి పై గా రైతులు పొగాకును వేలం కేంద్రానికి తీసుకురా గా అధిక శాతం బేళ్లను తిరస్కరించారు. విషయం తెలిసి రైతు సంఘం నాయకులు కొనుగోలు కేంద్రా న్ని సందర్శించారు.

జిల్లా రైతు సంఘం ప్రధాన కా ర్యదర్శి జజ్జర జయంత్‌ బాబు మాట్లాడుతూ చంద్ర బాబు ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పొగాకు రైతులకు తిప్పలు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశా­రు. వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులకు బ్యారెన్‌కు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని మండిపడ్డారు.  ఈనెల 18వ తేదీన పొగాకు రైతుల సమస్యలపై ఒంగోలులో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement