మొక్కజొక్క పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొక్క పంట దగ్ధం

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

మొక్కజొక్క పంట దగ్ధం

రూ.2.5 లక్షలు సష్టం

తాళ్లూరు: కోతకు వచ్చిన మొక్కజొక్క పంట ఆగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన మండలంలోని రామభద్రాపురం గ్రామ పొలాల్లో గురువారం జరిగింది. ప్రమాదంలో రైతులు కై పు వెంకటేశ్వరరెడ్డి, కై పు రమణారెడ్డి చెందిన పంట కాలి బూడిడైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పొలాల్లో మోటర్‌ వద్ద ఉంటే విద్యుత్‌ తీగలు ట్రిప్‌ అవ్వడంతో నిప్పు రవ్వలు వ్యాపించి మూడున్నర ఎకరాలు మొక్కజొన్న పంట అగ్గిపాలైనట్లు తెలిపారు. పంట దిగుబడి బాగా వచ్చిందని, దాదాపు రూ.2.5 లక్షలు సష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత దశలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement