దొనకొండ: మద్యం మత్తులో తమ్ముడిపై రాళ్ల దాడి చేసి అన్న హతమార్చిన ఘటన ఘటన మండలంలోని రుద్రసముద్రం ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. హతుడి భార్య కోటేశ్వరి కథనం ప్రకారం..కందుల చిన్న కాశయ్యపై అతని సోదరుడు పెద్ద కాశయ్య మద్యం తాగి వెంటపడి రాళ్ల దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం నెపంతో తన భర్తను హతమార్చాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కందుల పెద్ద కాశయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటనా స్థలాన్ని దర్శి సీఐ రామారావు పరిశీలించారు.
బెల్టుషాపుతోనే గొడవలు
గ్రామంలో ఏర్పాటు చేసిన బెల్టుషాపులో రేయింబవళ్లు మద్యం అందుబాటులో ఉంటుంది. దీంతో గ్రామస్తులు మద్యానికి బానిసై గొడవలకు దిగుతున్నారు. గ్రామంలోని బెల్టుషాపును తొలగించాలని గ్రామస్తులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశామని, అయినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.


