మార్కాపురం టౌన్: రేషన్‌కార్డుల్లో ఉన్న సభ్యులంతా తప్పనిసరిగా ఈకైవెసీ చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య అన్నారు. ఆదివారం నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా 10,15,212 కార్డులు ఉన్నాయని, అందులో 9,48,003 మంది ఈ కేవైసీ చేయించుకున్నారని, మిగిలిన వారు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేందుకు డీలర్లు కార్డుదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈకేవైసీ చేయించుకోకుంటే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసులు, ఎన్‌ఫోర్సుమెంట్ డీటీ ఆర్ సాలమ్మ, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.


