న్యూస్‌రీల్
కూటమి ఎమ్మెల్యేపై ఆరోపణలు...
అధినేతను విమర్శించినా పట్టించుకోకుండా...
ఒంగోలులో జరిగిన డీ లిమిటేషన్ సమావేశానికి రియాజ్ వర్గం డుమ్మా
అహుడా చైర్మన్ ఇంటికి వెళ్లి పిలిచినా రియాజ్ వర్గం హాజరుకాకపోవడంపై రచ్చ
పదవులు తీసుకొని పార్టీకి ఉపయోగపడడంలేదంటూ పరోక్షంగా రియాజ్‌పై బాలినేని చురకలు
టీడీపీ ఎమ్మెల్యేలు సహకరించడం లేదంటూ సేన నాయకుల విమర్శలు
యర్రగొండపాలెం ఇన్‌చార్జిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన కార్యకర్తలు
టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌ను వేదిక మీదకు పిలవగానే సమావేశం నుంచి వెళ్లిపోయిన నెల్లూరు జిల్లా కార్యకర్తలు
గ్లాసు పార్టీలో నేతల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. ఉమ్మడి జిల్లాలో జనసేన రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ ముఖ్యనేతలుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. ఒంగోలులో జరిగిన స్థానిక సంస్థల డీ లిమిటేషన్ ప్రక్రియ సమావేశం ఆగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ సమావేశానికి రియాజ్ డుమ్మా కొట్టడం, రియాజ్‌పై బాలినేని పరోక్ష విమర్శలు చేయడంతో వారి మధ్య వివాదం మరింత ముదిరి పాకానపడనుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
వర్గాలు రగిలి..
సీఐలు, ఎస్సైలకు సూచనలిస్తున్న ఎస్‌పీ హర్షవర్ధనరాజు
సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి బాలాజీ
ఒంగోలు సమావేశంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసైనికులు కొందరు తమ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు సహకరించడంలేదని ఆరోపణలు చేశారు. డీ లిమిటేషన్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మరల్చుకుంటున్నారని, ఉద్దేశపూర్వకంగానే జనసేనకు నష్టం కలిగేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతంరాజుని వేదిక మీదకు పిలవగానే కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఇన్‌చార్జికు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. అందరూ ఒక్కసారిగా వాదన పెట్టుకోవడంతో వేదిక వద్ద ఉద్రిక్తంగా మారింది. అలాగే నెల్లూరు జిల్లా నాయకుడు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌ను వేదిక మీదకు పిలవగానే అదే జిల్లాకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం.
జిల్లా జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పేరుకు జనసేన పార్టే కానీ ఇందులో జనసైనికులు ఎవరూలేరన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరుడిగా వ్యవహరిస్తుండడాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యే దామచర్ల నేరుగా పవన్ కల్యాణ్‌ను విమర్శించినప్పటికీ రియాజ్ స్పందించకపోవడం, ఆ తరువాత కూడా జనసేన కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపకుండా ఎమ్మెల్యే దామచర్ల అనుచరుడిగా, పక్కా టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని జనసైనికులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.


