రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా ఎడ్ల సత్తా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా ఎడ్ల సత్తా

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

కంభం: రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి తిరునాళ్లను పురస్కరించుకొని మండలంలోని రావిపాడు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పాలపండ్లసైజు బండలాగుడు పోటీలను గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్చార్జ్‌ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. పోటీల్లో మొత్తం 17 జతల ఎడ్లు పాల్గొనగా కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బీఎల్‌ఎన్‌ బుల్స్‌ శశాంక్‌ శ్రేయ ఎడ్లు 4500 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గిద్దలూరు మండలం మోడంపల్లికి చెందిన దేమ శ్రీరాములు ఎడ్లు 4200 అడుగులు లాగి ద్వితీయ స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన విజయలక్ష్మి ఎడ్లు, పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన వినోద్‌ కుమార్‌ ఎడ్లు 4200 అడుగుల దూరం లాగి మూడవ, నాల్గవ స్థానాల్లో దర్శి మండలం రాజంపల్లికి చెందిన శివన్నారాయణ ఎడ్లు 4087 అడుగులు లాగి 5వ స్థానం, రావిపాడుకు చెందిన పిదప శరభారెడ్డి ఎడ్లు 3916.9 అడుగులు లాగి ఆరో స్థానం, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన సూరా చైత్రా రెడ్డి, పూజితారెడ్డి ఎడ్లు 3830.5 అడుగులు లాగి 7వ స్థానం, మండలంలోని సైదాపురానికి చెందిన సబ్బసాని శశిధర్‌ రెడ్డి, నెమలిదిన్నె చెన్నారెడ్డి ఎడ్లు 3706.2 అడుగులు లాగి ఎనిమిదో స్థానంలో నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement