ఉలవపాడు: కోనేరులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన ఉలవపాడులో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. ఉలవపాడులోని వేణుగోపాల స్వామి ఆలయం కోనేరులో మృతదేహం తేలుతుండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గమనించి, ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతుడిని సన్నెబోయిన రమణయ్య(70)గా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. బంధువులంతా కలిసి మృతదేహాన్ని బయటకు తీసి ఆయన స్వగృహానికి తరలించారు. మంగళవారం రాత్రి కోనేరులో పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.


