లాభం అంతాసిండికేట్‌కే...
న్యూస్‌రీల్
చౌక దుకాణాలే రేషన్ మాఫియాకు అడ్డాగా మారిపోతున్నాయి..అధికార పార్టీ టీడీపీ నేతల కనుసన్నలో నడుస్తున్న ఈ దుకాణాలకు వెళ్తున్న లబ్ధిదారులకు వింత పరిస్థితి ఎదురవుతోంది. బియ్యం లేవు.. వేలి ముద్రలు వేసి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లండంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే దాడులకు తెగబడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పేదల బియ్యాన్ని కొల్లగొడుతున్న రేషన్ మాఫియా పోర్టుల ద్వారా విదేశాలకు తరలించి రూ.కోట్లు గడించి జేబులు నింపుకుంటున్నారు. ఈ తంతు అధికారులకు తెలిసినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, మామూళ్ల మత్తులో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క కందుకూరు నియోజకవర్గం, పరిసర నియోజకవర్గాల నుంచి దాదాపు 1200 టన్నుల మేర బియ్యం పక్కదారి పడుతోంది.
పేదోడి ముద్దను
మింగేస్తున్న మాఫియా..
మధ్య వ్యాపారులు మిల్లర్లు రూ.18 నుంచి 20 వరకు ఇస్తారు. రైస్ మిల్లుల్లో పాలిష్ పట్టి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడ కేజీకి రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయిస్తున్నారు. పాలిష్ పట్టిన మిల్లు నిర్వాహకులకు కేజీకి రూపాయి ఇస్తారు. ఇలా సరాసరి కేజీకి రూ.15 వరకు సిండికేట్‌కు లాభం వస్తుంది. ఈ లాభాలన్నీ నియోజకవర్గ అధికార పార్టీ పెద్దలకు చేరుతుంది. నియోజకవర్గం నుంచి ప్రతి నెలా సుమారు 800 నుంచి 900 టన్నులు బియ్యం వరకు పక్కదారి పడుతోందని తెలుస్తోంది. సమీప నియోజకవర్గాల నుంచి మరో 200 నుంచి 300 టన్నులు పోర్టుకు చేరుతోందని సమాచారం. మధ్యవర్తులు, వాహనాల ఖర్చులు అన్ని పోను ఎలా చేసుకున్నా నెలకు కోటి రూపాయలు సిండికేట్ జేబుల్లోకి చేరుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


