60 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

60 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

60 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

గుడ్లూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని గుడ్లూరు పోలీసులు సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. రాజుపాలెం రోడ్డులోని రామాలయం వద్ద ఆగి ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా తెల్ల గోతాల్లో ఉన్న బియ్యం మూటలు కనిపించాయి. దీంతో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి పరిశీలించారు. వాటిలో రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకొని విచారించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఐవీ వెంకట్రావు తెలిపారు. కేసులో డ్రైవర్‌ మల్లికార్జునతో పాటు ఎస్‌.మురళిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement