నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులు సీజ్‌ చేస్తాం | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సులు సీజ్‌ చేస్తాం

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

ఒంగోలు సబర్బన్‌: స్కూల్‌, కాలేజీ బస్సులు నిబంధనలు పాటించకుంటే సీజ్‌ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఆర్‌ సుశీల హెచ్చరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రవాణా శాఖాధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డీటీసీ మాట్లాడుతూ జిల్లాలో 744 స్కూల్‌, కాలేజీ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. బస్సులన్నీ నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలన్నారు. జిల్లాలో 250 బస్సులను తనిఖీ చేయగా 137 బస్సులు నిబంధనలతో ఉన్నాయని, నిబంధనలు లేని 113 బస్సులను వెనక్కి తిప్పి పంపామన్నారు. నిబంధనల ప్రకారం స్కూల్‌ బస్సులన్నీ అత్యవసర ద్వారం, అత్యవసర కిటికీలు, అన్ని కిటికీలకు రైలింగ్స్‌, స్పీడ్‌ లిమిట్‌ జీపీఎస్‌ సిస్టం, ఇతర భద్రతా పరికరాలు అమర్చుకోవాలని సూచించారు.

జిల్లాలో 23 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు

జిల్లా వ్యాప్తంగా రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 23 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించినట్లు పేర్కొన్నారు. అందులో ఫిబ్రవరిలో 13 ప్రాంతాలను పరిశీలించామని, తాజాగా మరో ఐదు బ్లాక్‌ స్పాట్స్‌ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అలవలపాడు క్రాస్‌ రోడ్‌, వెంకటాపురం క్రాస్‌ రోడ్‌, తిమ్మన్నపాలెం విలేజ్‌ జంక్షన్‌, యాదవ హోటల్‌, పైలాన్‌ సెంటర్‌ దగ్గర, మేదరమెట్ల, ద్వారకా నగర్‌ జంక్షన్‌, అద్దంకిలోని ప్రాంతాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ, దర్శి సీఐ ఎండ్లూరి రామారావు, నేషనల్‌ హైవేస్‌ –16 ప్రాజెక్టు డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

స్కూలు బస్సులకు ఎఫ్‌సీ తప్పనిసరి

జిల్లా వ్యాప్తంగా 23 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు

డిప్యూటీ ట్రాన్స్‌పోర్సు కమిషనర్‌ సుశీల

Advertisement
 
Advertisement
Advertisement