యర్రగొండపాలెం: నీటి కుంటలో మునిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు రూ.50వేల ప్రకారం ఆర్థిక సహాయం అందచేశారు. మండలంలోని బోయలపల్లి ఎస్సీ పాలెంకు చెందిన కొమ్ము శశికుమార్(11), బోయలపల్లి దీపన్(10)లు గత నెల 14వ తేదిన పొలంలో ఉన్న నీటికుంట(ఫారం పాండ్)లో జారిపడి మృతి చెందారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యశాలకు చేరి చిన్నారుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబం కోలుకోలేని పరిస్ధితిలో ఉండటం వలన ఆయన మరో సారి ఎస్సీ పాలెంకు చేరి వారిని ఓదార్చారు. కూలి పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ఆ చిన్నారుల ఒక్కొక్క కుటుంబానికి రూ.50వేల ప్రకారం ఆర్థికసాయం అందచేశారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, చేదూరి విజయభాస్కర్, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, కోల వెంకటేశ్వర్లు, రాములు నాయక్, సురేష్ నాయక్ ఉన్నారు.


