రెండేళ్లలో కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం రెండేళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తి జగనన్న అందరం సమష్టి కృషితో మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందాం కూనంనేనివారిపాలెం ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్లలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, చుండూరి రవి

చీమకుర్తి రూరల్‌: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కూనంనేనివారిపాలెం గ్రామంలో ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం 25వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి నిర్వహించిన తిరునాళ్లలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభపై పమిడి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, ఆరుగాలం అష్టకష్టాలు పడి పొగాకు పండించిన రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు. రైతన్నల పక్షాన వైఎస్సార్‌ సీపీ నాయకులు పోరాడితే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడంలో చూపుతున్న శ్రద్ధ పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించడంలో లేదని విమర్శించారు. ప్రజలకు మాట ఇస్తే నెరవేర్చే వ్యక్తి జగనన్నే అని, ఎన్నికల సమయంలో ప్రజలకు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి సంక్షేమ పథకాలు నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజలకు అండగా సంక్షేమ పథకాలు అమలు చేసిన జగనన్నను ఎన్ని కష్టాలు వచ్చినా మనమందరం సమష్టి కృషితో మళ్లీ సీఎం చేసుకోవాలని అన్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలోనే రైతులకు అండ: మాజీ మంత్రి మేరుగు నాగార్జున

మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి అందిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించకుండా పేద ప్రజలను, మహిళలను, గిట్టుబాటు ధరలు ఇవ్వక రైతులను మోసగించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, గ్రామపార్టీ అధ్యక్షుడు యర్రగుంట్ల మోహన్‌, యర్రగుంట్ల వసంతరావు, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, మండల రైతు విభాగం అధ్యక్షుడు నల్లూరి రామచంద్రారావు, గోరంట్ల రామకృష్ణ, వేమూరి బాలకృష్ణ, పేరాబత్తిన పేరయ్య, పాటిబండ్ల గంగయ్య, సుందరరామిరెడ్డి, పాలడుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement