ఆదివారం
సత్యమేవ జయతే
3-5-2026
మార్కాపురం: ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా విద్యార్థులను తీసుకెళ్లే బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ చండ్రా రాంబాబు హెచ్చరించారు. శనివారం మార్కాపురం డీటీఓ కార్యాలయంలో జిల్లాలోని వివిధ విద్యాసంస్థల యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి పాఠశాల బస్సు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు చేయించుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. బస్సుల్లో స్పీడ్ కంట్రోల్ పరికరాన్ని బిగించుకోవాలని, ఫస్టు ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిమిత వేగంలోనే బస్సులు నడపాలన్నారు. మరో ఎంవీఐ భాస్కర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
www.sakshi.com
‘గ్రామం ప్రగతిపథంలో ఉంటే
ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు’


