తిరుచిరాపల్లి ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా విజయలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

తిరుచిరాపల్లి ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా విజయలక్ష్మి

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

తిరుచిరాపల్లి ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా విజయలక్ష్మి

సింగరాయకొండ: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి ఇన్‌కంటాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా 1992 ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సతీమణి టీహెచ్‌ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈనెల 11వ తేదీ ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈమె 33 సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్‌ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించి ఆయా స్థానాలకు వన్నెతెచ్చిన ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో జాయింట్‌ కమిషనర్‌గా బెంగళూరు, రాయచూర్‌లో, అడిషనల్‌ కమిషనర్‌గా కర్నూలులో, కమిషనర్‌గా చైన్నెలో, ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహించారు. విజయలక్ష్మి హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీలో ఈసీఈ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశారు. ఐఏఎం బెంగళూరులో ఎంబీఏ కోర్సు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి ప్రజా విధానాలపై సింగపూర్‌ యూనివర్శిటీ, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీలో ప్రత్యేక డిగ్రీ సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement