వైఎస్సార్‌ సీపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ బలోపేతమే లక్ష్యంగా కమిటీల ఏర్పాటు

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

● మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సింగరాయకొండ: నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ బలోపేతమే లక్ష్యంగా మండల, గ్రామ కమిటీలను పూర్తి చేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆరు మండలాల మండల పార్టీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. డాక్టర్‌ సురేష్‌ శుక్రవారం మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్‌ కాలేజి నుంచి జూమ్‌ మీటింగ్‌లో వర్చువల్‌ గా మండల పార్టీ అధ్యక్షులకు పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ మండల, గ్రామ కమిటీల నియామకం పూర్తి చేయటం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో పర్యటించి గ్రామ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలవాలని సూచించారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, చింతపల్లి హరిబాబు, బచ్చల కోటేశ్వరరావు, దుద్దుగుంట మల్లిఖార్జునరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement