ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో పరిశోధక విద్యార్థులకు (ప్రీ.పి.హెచ్.డి పార్ట్–1) 2023–24 కు సంబంధించి డిసెంబరులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్ మూర్తి బుధవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు 52 మంది విద్యార్థులు హాజరుకాగా 94.23 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ సోమశేఖర తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిర్మలమణి, డీన్ అకడమిక్స్ ప్రొఫెసర్ జి.రాజమోహనరావు, తదితరులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పీజీ పరీక్షల కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసులు, పరీక్షల విభాగం పర్యవేక్షకులు సూడా శివరాం, తదితరులు పాల్గొన్నారు.


