శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

కొండపి నియోజకవర్గంలో పచ్చనేతల దోపిడీ యథేచ్ఛగా ఇసుక, మట్టి, గ్రావెల్‌ దందా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ప్రభుత్వ పెద్దల అండదండలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు రూ.కోట్లు విలువైన సంపదను దోచేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు

çßæÐ]l$ÃĶæ*Å..º-†-MìS´ùĶæ*… ♥

ఉలవపాడు మండలంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా దగ్ధమైంది. 36 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.

రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతింటున్నాయి

జరుగుమల్లి మండలంలో పాలేరులో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. పాలేరు పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి రక్షిత మంచినీటి పథకాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. జేసీబీ, టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరగటంతో పాలేరులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల కారణంగా వరదల సమయంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.

– యర్రా రామకృష్ణ, వైఎస్సార్‌ సీపీ ఐటీ విభాగం కొండపి నియోజకవర్గ అధ్యక్షుడు

ఇసుక తవ్వకాలతో వరద భయం

మండలంలోని పాలేరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వీరు ఇష్టారాజ్యంగా జేసీబీతో తవ్వి భారీ గుంతలు ఏర్పాటు చేయటంతో భూగర్భ జలాలు అడుగంటి రక్షిత మంచినీటి పథకాలకు నీరు సరఫరా కాని దుస్థితి ఉంది. ఇసుక తవ్వకాల వలన నది దిశ మార్చుకుని వరదల సమయంలో ఊరుపై వరదలు వచ్చే అవకాశం ఉంది.

– పిన్నిక శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు, జరుగుమల్లి

మట్టి మేతగాళ్లు నిబంధనలకు నిలువునా పాతరేస్తున్నారు. నిరాటంకంగా కొండల్ని పిండి చేసేస్తున్నారు. చెరువులను చెరపట్టిస్తున్నారు. కాల్వలను కనిపించకుండా మాయం చేస్తున్నారు. ఇష్టారీతిగా తవ్వుకో, దోచుకో, తినుకో అని దోపిడీ సూత్రాన్ని పాటిస్తున్నారు. ‘‘ఎక్కడైనా తవ్వుకోండి. ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోండి. ఎవరూ అడ్డుకోరు. ఎవరైనా ఆపితే చూద్దాం’’ అంటూ అధికార పార్టీ నేతలు అభయం ఇస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రూ.కోట్లు విలువజేసే సంపదను కొల్లకొడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొండపి నియోజకవర్గంలో భారీ యంత్రాలతో రేయింబవళ్లు తవ్వకాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

తవ్వుకో దోచుకో తినుకో!

Advertisement
 
Advertisement
Advertisement