న్యూస్‌రీల్
బార్లను తలపిస్తున్న హైవే దాబాలు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారి పక్కన విచ్చలవిడిగా వెలిసిన దాబాలు సుమారు 150 నుంచి 200 వరకూ దాబాలు రాత్రయితే చాలు.. మందు, విందులతో రచ్చ పర్యవేక్షణ గాలికి వదిలేసిన ఎకై ్సజ్ అధికారులు కీలక అధికారికి నెలవారీ ముడుపులు అందుతున్నట్టు ప్రచారం
‘లైట్’గా తీసుకుంటే ముప్పే!
వాహనాలకు విచ్చలవిడిగా అధిక సామర్థ్యంతో కూడిన ఎల్‌ఈడీ లైట్ల వినియోగంతో ఎదురుగా వస్తున్న వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి.
పేరుకే ఫ్యామిలీ దాబాలు.. బార్లలోలా మద్యం సర్వీస్ జరుగుతోంది. కేవలం ఆహార పదార్థాలు మాత్రమే అందించాల్సిన దాబాల్లో మూడు విస్కీలు, ఆరు బీర్లు అన్న విధంగా అమ్మకాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున కోడి కూసేదాకా దాబాలు తెరిచే ఉంచడంతో మందు, విందులకు కేరాఫ్‌గా మారాయి. ఊరిబయట హాయిగా సిట్టింగ్ సౌకర్యం కూడా ఉండటంతో బార్ కంటే నయమని మందుబాబులు దాబాల బాట పడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటు పడిన అబ్కారీ శాఖాధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.


