మామిడి రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతు కుదేలు

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

మామిడి రైతు కుదేలు

సింగరాయకొండ మండలంలో 300 టన్నులు రాలిన మామిడి కాయలు

సుమారు రూ.2 కోట్ల నష్టం

భారీ నష్టాలు వస్తాయంటూ రైతుల ఆందోళన

గాలివానకు

సింగరాయకొండ:

ండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు మామిడి చెట్లకు ఉన్న కాయల్లో సుమారు 70 శాతం రాలిపోయాయి. 300 టన్నుల వరకూ కాయ రాలిందని, ప్రస్తుతం టన్ను ధర రూ.70 వేలు ఉందని, మొత్తం రూ.2 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో శానంపూడి, కనుమళ్ల, సోమరాజుపల్లి, పాతసింగరాయకొండ ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో మామిడి సాగు చేశారు. ఈ సంవత్సరం చెట్లకు పూత సరిగా రాక, ఒకవేళ పూత వచ్చినా తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా రాలిపోయి దాదాపు 70 శాతం చెట్లకు సక్రమంగా కాపు లేదు. అరకొరగా కాసిన కాయలు కాపాడుకుంటున్నామని, ప్రస్తుతం ధర కూడా బాగానే ఉందని, ఈ తరుణంలో ఆదివారం రాత్రి హఠాత్తుగా వీచిన ఈదురుగాలులు, వర్షానికి కాయ మొత్తం రాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెట్టుపై మామిడికాయలు లేత దశలో ఉన్నాయి. వేడిగాలులు వీస్తుండటంతోమరో 10 రోజులు దాటితే పక్వానికి వచ్చి మంచి ధర వచ్చేది. కానీ, గాలులకు కాయ రాలిపోవడంతో కేజీ రూ.10కి మాత్రమే అడుగుతున్నారు. టన్ను ధర రూ.10000 మాత్రమే పలుకుతుండటంతో నష్టాలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం ప్రకృతి కారణంగా భారీగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు మాత్రం ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి తోట పూర్తిగా ధ్వంసమైతే తప్ప రైతుకు నష్టపరిహారం రాదంటున్నారు. ఈదురుగాలుల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయటంగానీ, నష్టపరిహారం వచ్చే అవకాశంగానీ లేదని చెప్పడంపై రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం టన్ను ధర రూ.70 వేలు

నష్టపరిహారం రాదంటున్న ఉద్యానవన శాఖాధికారులు

Advertisement
 
Advertisement
Advertisement