దళితులపై దాడులు సహించం | - | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులు సహించం

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

ూర్కాపురం టౌన్‌: దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడా శ్రావణ్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం మార్కాపురం వచ్చిన ఆయన మార్కాపురం జిల్లా మాల జేఏసీ నాయకులు, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉంటానని చెప్పారు. రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ.. దళితుల మధ్య చిచ్చుపెట్టి రిజర్వేషన్లను పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే వర్గీకరణ చేశారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్‌ 20 శాతం పెంచాలని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట మార్కాపురం జిల్లా జేఏసీ అధ్యక్షుడు శాంత కుమార్‌, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శామ్యుల్‌, యోహన్‌, రాజశేఖర్‌, ఏడుకొండలు, లక్ష్మీనారాయణ, కృష్ణారావు తదితరులు ఉన్నారు.

న్యాయవాది జడా శ్రావణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement