విద్యుదాఘాతంతో మొక్కజొక్క పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మొక్కజొక్క పంట దగ్ధం

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

సుమారు రూ.3 లక్షల సష్టం

తాళ్లూరు: కోతకు వచ్చిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రమణాలవారి పాలెం పొలాల్లో బుధవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కై పు రమణారెడ్డి 1.5 ఎకరాలు, కై పు వెంకట రామిరెడ్డి 3.5 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరికొద్ది రోజుల్లో పంట కోయాల్సి ఉంది. పొలం గట్టు వెంట ఉన్న విద్యుత్‌ తీగలు ట్రిప్‌ అవ్వడంతో నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న తోటకు మంటలు వ్యాప్తించాయి. ఐదు ఎకరాల్లో పంట కాలి బూడిదైంది. పంట దిగుబడి బాగా వచ్చిందని, రూ.3 లక్షల మేర సష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement