● వివరాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లు
సీఎస్‌పురం (పామూరు):
వైఎస్సార్ సీపీ నేత మిరియం బాబుచౌదరి (42) శుక్రవారం దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని పెద్దగోగులపల్లెలో పామూరు సీఐ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో శనివారం విచారణ చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో గుంటూరు ఫోరెన్సిక్ బృందం, కనిగిరి క్లూస్ టీమ్‌లు రక్తనమూనాలు, వేలిముద్రలు సేకరించాయి. నిందితుడు హత్యకు వాడిన కత్తి, ఇతర ఆధారాలు పోలీసు అధికారులు సేకరించారు. దీనిపై సీఐ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా మిరియం బాబుచౌదరి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో నిందితులను అరెస్టు చేసి వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.


