కనిగిరి రూరల్: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై టి.సందీప్ కుమార్ కథనం మేరకు.. పీసీపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగులూరి శ్రీనివాసులు(30) భార్యతో గొడవపడి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం కనిగిరి పట్టణ సమీపంలోని చింతలపాలెం మోడల్ స్కూల్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వీఆర్వోకు సమాచారం అందించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


