పెద్దదోర్నాల: అనారోగ్యంతో మృతి చెందిన పెద్దదోర్నాల ఎంపీపీ గుమ్మా పద్మజా యల్లేష్ నానమ్మ మృతికి యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఘన నివాళులర్పించారు. ఎంపీపీ పద్మజా యల్లేష్ నానమ్మ ఒంటేరు గంగమ్మ అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హుటాహుటిన మండల కేంద్రంలోని ఎంపీపీ ఇంటికి చేరుకుని గంగమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఒంటేరు రమణయ్య, ఎంపీపీ గుమ్మా పద్మజ, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్‌లను ఆయన పరామర్శించి వారికి ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. నివాళులర్పించిన వారిలో మండల పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దర్శనం నాగయ్య, మార్కెట్ యార్డు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ఒంటేరు నాగేఽశ్వరరావు, జేసీబీ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


