హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబు

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

అద్దంకి రూరల్‌: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న హనుమజ్జయంతి వేడుకలకు శింగరకొండ ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దేవస్థానం ఎదుట చలువ పందిళ్లు వేసి విద్యుద్దీపాలంకరణ చేశారు. 12వ తేదీ స్వామి వారికి కదలీ ఫలార్చన, సాయంత్రం 4 గంటలకు 3 వేల మందితో కోటి తలంబ్రాల శోభాయాత్ర, సాయంత్రం 7 గంటలకు సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి తిమ్మనాయుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement