ఒంగోలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 ఆన్‌లైన్ సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్టులు) పరీక్ష ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో, మార్కాపురంలోని 2 పరీక్ష కేంద్రాల్లో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు పూటలా జరుగుతాయి. ఒంగోలులోని 6 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 929 మంది విద్యార్థులకు గాను 888 మంది హాజరుకాగా, 41 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 929 మంది విద్యార్థులకు గాను 888 మంది హాజరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారు. అలాగే మార్కాపురంలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 285 మంది విద్యార్థులకు గాను 272 మంది హాజరుకాగా, 13 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలో మొత్తం 285 మందికి గాను, 271 మంది హాజరుకాగా, 14 మంది గైర్హాజరయ్యారు.


