మెటీరియల్‌ అమోఘం.. మార్కులే ‘సాక్షి’ | - | Sakshi
Sakshi News home page

మెటీరియల్‌ అమోఘం.. మార్కులే ‘సాక్షి’

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

విద్యార్థి దశలో భవితకు పదో తరగతి పునాది. టెన్త్‌లో సాధించే మార్కులు పైచదువుల అడ్మిషన్‌కు, ఉద్యోగాల సాధనకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల విజయానికి తోడుగా నిలవాలని భావించిన ‘సాక్షి’ యాజమాన్యం.. ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ రూపొందించింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్‌ అందజేసింది. అంతేకాకుండా ‘సాక్షి భవిత’లో టెన్త్‌ విద్యార్థుల కోసం మాక్‌ టెస్టులు, సబ్జెక్టుల వారీ విశ్లేషణలు ప్రచురించింది. ఇటీవల టెన్త్‌ ఫలితాలు విడుదల కాగా, ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పలువురు ‘సాక్షి’తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. అత్యధిక మార్కుల సాధనకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ దోహదపడిన తీరును వివరిస్తూ సంతోషం వెలిబుచ్చారు.

– చీమకుర్తి రూరల్‌/

బల్లికురవ/పుల్లలచెరువు

సులభంగా సాధన

సరైన సమయంలో ‘సాక్షి’ యాజమాన్యం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసింది. టెక్స్‌ట్‌ బుక్‌లు, నోట్స్‌తో కుస్తీ పట్టే పని లేకుండా సులభంగా, సమగ్ర సమాచారంతో అన్ని విభాగాలను కవర్‌ చేస్తూ ప్రచురించిన స్టడీ మెటీరియల్‌ చదివి 585 మార్కులు తెచ్చుకున్నా. మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు స్టడీ మెటీరియల్‌ ఎంతో ఉపయోగపడింది.

– టి.పవన్‌కుమార్‌, పుల్లలచెరువు జెడ్పీ పాఠశాల

నూరు శాతం ఉత్తీర్ణత

‘సాక్షి’ అందజేసిన మెటీరియల్‌ చదివాం. మోడల్‌ పేపర్లను ఉపాధ్యాయులు ప్రాక్టీస్‌ చేయించారు. దాంతో మా పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాఽధించాం. నేను 576 మార్కులు సాధించి మండల స్థాయిలో సత్తా చాటడం సంతోషంగా ఉంది.

– కె.లోహిత్‌దత్త,

కూకట్లపల్లి

(బల్లికురవ)

మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేశా..

పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ‘సాక్షి’ మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేశా. 515 మార్కులు సాధించా. మా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనతోపాటు ‘సాక్షి’ మెటీరియల్‌ కూడా మెరుగైన పలితాలు సాధించడానికి దోహదపడింది.

– యద్దనపూడి లోకేష్‌,

బండ్లమూడి జెడ్పీహెచ్‌

(చీమకుర్తి)

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌పై టెన్త్‌ విద్యార్థుల మనోగతం మార్కుల సాధనలో కీలకంగా భవిత పాఠాలు, మాక్‌ టెస్టులు

పుల్లలచెరువు జెడ్పీ హైస్కూల్లో ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులు (ఫైల్‌)

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో గాడిపర్తివారిపాలెం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు (ఫైల్‌)

‘సాక్షి’ ప్రోత్సాహం అద్భుతం

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ను అందజేయడం విద్యార్థులకు ప్రోత్సాహాన్నిచ్చింది. మా ప్రాక్టిస్‌కు మోడల్‌ పేపర్లు బాగా ఉపయోగపడ్డాయి. దాంతోపాటు ఉపాధ్యాయులు బోధనతో 575 మార్కులు సాధించా. ‘సాక్షి’కి కృతజ్ఞతలు.

– ఎస్‌కే షర్మిల,

రావినూతల(మేదరమెట్ల)

సాక్షి అందజేసిన మెటీరియల్‌ బాగా ఉపయోగపడింది. నేను అందులో మోడల్‌ పేపర్లను క్షుణ్ణంగా చదివా. ఉపాధ్యాయులు ఇచ్చిన గైడెన్స్‌తో 550 మార్కులు సాధించాను. మంచి మార్కులు రావడానికి దోహదపడిన ‘సాక్షి’కి అభినందనలు.

– ఎ.సాయి, తిమ్మాయపాలెం(అద్దంకి)

పోటీ పరీక్షలకూ పనికొస్తుంది

‘సాక్షి’ మీడియా పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్‌ పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యేందుకు బాగా సహకరించింది. ఈ మెటీరియల్‌ను భద్రపరచుకుంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. టీచర్ల సహకారం, ‘సాక్షి’ ప్రోత్సాహంతో 563 మార్కులు సాధించగలిగా.

– కె.చిన్న మరియమ్మ, కేజీబీవీ, పుల్లలచెరువు

Advertisement
 
Advertisement
Advertisement