వైఎస్సార్‌ విగ్రహం కూల్చివేత | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విగ్రహం కూల్చివేత

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

సంతమాగులూరు (అద్దంకి): సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామంలో గతంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. సిమెంటు పిల్లరుపై స్లాబు వేసి దానిపై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ట్రాక్టర్లతో లాగించి పడేశారని ఆ గ్రామ వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలు దారుణమని వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్డర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement