మార్కాపురం పోలీ్‌స్‌ గ్రీవెన్స్‌కు 33 వినతులు | - | Sakshi
Sakshi News home page

మార్కాపురం పోలీ్‌స్‌ గ్రీవెన్స్‌కు 33 వినతులు

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

మార్కాపురం పోలీ్‌స్‌ గ్రీవెన్స్‌కు 33 వినతులు

మార్కాపురం: పట్టణంలోని ఇన్‌చార్జి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీ్‌స్‌ గ్రీవెన్స్‌కు 33 అర్జీలు అందాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి అర్జీదారులు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు అందించినట్లు మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. వాటిని ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు పంపించి చట్టపరిధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సివిల్‌, చీటింగ్‌ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మార్కాపురం, త్రిపురాంతకం, పామూరు సీఐలు అల్తాఫ్‌ హుస్సేన్‌, హస్సన్‌, వినోద్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement